VKB: బొంరాస్ పేట మండల వ్యాప్తంగా గ్రామాల్లో చలి పంజా విసురుతుండగా ఒకవైపు ప్రజలు, మరోవైపు వరి నారుమడులు గజగజ వణికి పోతున్నాయి. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రైతులు సిద్ధం చేసుకున్న వరి నారుమడులు నెల రోజులు గడుస్తున్నా పెరగడం లేదని వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు.