NZB: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సీపీ అదేశాల మేరకు బోధన్ పట్టణంలో డిసెంబర్ 31న ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు చేపడతామని సీఐ వెంకటనారాయణ తెలిపారు. తాగి వాహనాలు నడపరాదని, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారకులు కాకూడదని, ఆంక్షలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.