రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘రాజాసాబ్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ రిద్ది కుమార్ కట్టుకున్న చీరను ప్రభాస్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు SMలో చర్చ జరుగుతోంది. దీనిపై రిద్ది కుమార్ స్పందిస్తూ.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తాను ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వగా, దానికి రిటర్న్ గిఫ్ట్‌గా ఆయన ఈ చీరను ఇచ్చారని క్లారిటీ ఇచ్చింది.