EG: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 30 మంగళవారం రాజానగరంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ స్కిల్ హబ్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. 19-30 ఏళ్ల వయస్సు కలిగి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.