ASR: డుంబ్రిగూడ మండలంలోని కొర్రా పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం ట్రెడ్స్ ఐహెన్ఆర్సీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర, జనరల్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు అనిల్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని గిరిజన ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం వృద్ధులకు చలి దుప్పట్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.