ADB: ఆదిలాబాద్‌కు చెందిన కొంకటి ఇతీక్ష హైదరాబాద్‌లో జరిగిన ‘లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా’ ఫ్యాషన్ షోలో జూనియర్ మిస్ ఇంటెలిజెంట్ టైటిల్ సాధించింది. సినీ నటుడు నితిన్ మెహతా ప్రశ్నలకు చాకచక్యంగా సమాధానాలిచ్చి విజేతగా నిలిచింది. ఈ టైటిల్‌ను కౌశల్ చేతుల మీదుగా అందుకుంది. కుమార్తె విజయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.