KNR: తిమ్మాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల సర్పంచులు ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా తాట్ల తిరుపతి, సలహాదారులుగా సురం స్వప్న, ఉపాధ్యక్షులుగా మామిడి మమతా, కనకం లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఆవుదుర్తి రామకిషన్, కోశాధికారిగా గోదరి శోభారాణి పాల్గొన్నారు.