రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు శాంతి ఒప్పందానికి దగ్గరగా వచ్చామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ తర్వాత మాట్లాడారు. ఒకటి రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఒప్పందం విషయంలో పురోగతి సాధించామన్నారు. 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై 95 శాతం అంగీకరించినట్లు జెలెన్స్కీ తెలిపారు.