MBNR: కురుమూర్తి గ్రామ శివారు నుంచి మట్టి పేరుతో అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అక్రమార్కులు ఖాళీ వాహనాలతో పరారయ్యారు. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేశారు.