KMM:గ్రీన్ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే సత్తుపల్లి నుంచి ఖమ్మంకు కేవలం 34 నిమిషాల్లోనే చేరుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జనవరి తర్వాత ఈ రహదారిని ప్రారంభిస్తామని గంగారంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. సత్తుపల్లి అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే గోదావరి జలాలతో నియోజకవర్గంలోని చెరువులను నింపుతున్నట్లు పేర్కొన్నారు.