పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫోటోగ్రఫీ ద్వారా జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించడానికి ఆర్టీసీ బస్సులో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా “హైదరాబాద్ ఆన్ వీల్స్” టైగర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కెబిఆర్ పార్క్ ప్రాంగణంలో ‘హైదరాబాద్ ఆన్ వీల్స్’ బస్సుపై టైగర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్) రాకేష్ మోహన్ డోబ్రియాల్, ఐఎఫ్ఎస్ సమక్షంలో ప్రారంభించారు.
TSRTC ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఆర్గనైజేషన్, ICBM స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించింది. ఈ ఎగ్జిబిషన్లో ICBM స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ జితేందర్ గోవిందనీ, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన పులి చిత్రాలను TSRTC ప్రదర్శిస్తోంది. దీంతోపాటు హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను కూడా వివరించనున్నారు. ఫోటో ఎగ్జిబిషన్లో పెద్ద పులల అందం, భావోద్వేగాలు, మనోభావాలను సంగ్రహించే 18 ఫోటోలు ఉన్నాయి. ఉత్కంఠభరితమైన ఫోటోలను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ డాక్టర్ జితేందర్ గోవిందనీ క్లిక్ చేశారు. మొబైల్ ఎగ్జిబిషన్ బస్సును పాఠశాలలు, కళాశాలలతో సహా నగరంలోని వివిధ ప్రదేశాలలో ఉంచబడుతుంది.
భారత దేశంలోనే తొలి ట్రావెలింగ్ ఫోటో గ్యాలరీ #HyderabadBusOnWheels బస్ లో 'టైగర్ ఫోటో ఎగ్జిబిషన్' ను పీసీపీఎఫ్ ఆర్ఏం డోబ్రియల్ గారితో కలిసి #KBRPark లో ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ఐసీబీఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్… pic.twitter.com/QP0NCduWMp