ASR: డుంబ్రిగూడ మండలం సాగర గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను గ్రామస్థులకు అందించేందుకు ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని ఎంపీటీసీ వంతల దేవదాసు ప్రారంభించారు. లబ్ధిదారులకు ఫుడ్ బాస్కెట్ కమోడిటీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా లభించే ఆహార పదార్థాలు గ్రామ ప్రజల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు.