EG: రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కేజీ స్కిన్లెస్ రూ.280, స్కిన్‌తో రూ.260 వద్ద విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.150 నుంచి రూ.160 మధ్య ఉంది. మటన్ ధర కేజీ రూ.900 నుంచి రూ.1000 పలుకుతోంది. ధరలు పెరిగినా మాంసం కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.