ELR: పోలవరం మండలం, కచేరి వద్ద, ఇరిగేషన్ ఆఫీస్ కాంపౌండ్లో ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డు ఇల్లు శనివారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. సమయానికి ఇంటిలో ఉన్నవారు క్రిస్మస్ పండుగకు పక్కనే ఉన్న దేవరగొంది గ్రామం వెళ్లటంతో ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో, చుట్టుపక్కల గృహాల వారు ఊపిరి పీల్చుకున్నారు.