W.G: అమ్మవారి జాతరలు గ్రామోత్సవాలు గ్రామ పట్టణ శాంతిని కోరుకుంటాయని, సంప్రదాయ బద్దంగా శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బలుసుమూడిలోని శ్రీమావుళ్ళమ్మ జాతర మహోత్సవాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. మూడేళ్లకు ఒక్కసారి అమ్మవారి జాతర జరుగుతుందన్నారు.