VZM: నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేడుకల సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపితే ఎలాంటి సడలింపులు ఉండవని ఆయన హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిని ఆ రోజు జైలుకు తరలించి కూర్చోబెడతామని ఎస్పీ స్పష్టం చేశారు.