జగిత్యాల: జిల్లా కలెక్టరేట్లో బుధవారం సర్పంచ్లకు 99 రోజుల “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని అధికారులు సూచించారు. ఈ శిక్షణలో పెగడపల్లి మండల సర్పంచ్లు పాల్గొని, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అవగాహన పొందారు.