NTR: సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నా కనకమేడల రవీంద్ర కుమార్‌ను విజయవాడ బృందావన్ కాలనీలో ఆయన కార్యాలయంలో కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురామ్ కలసి శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ కార్యనిర్వహణలలో విజయం సాధించి దేశ ప్రతిష్టను ఇమ్మడింప చేయాలని ఆకాంక్షించారు.