రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ‘మోగ్లీ’. DEC 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘ఈటీవీ విన్’ ఓటీటీ వేదికగా జనవరి 01 నుంచి స్టీమింగ్ కానుంది. ఈ మేరకు ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.