AP: తిరుమల శ్రీవారి ఆలయంపై YCP నేతలు విష ప్రచారం చేస్తున్నారని TTD పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, కమీషన్ల కోసం కక్కుర్తి పడలేదని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. ఆలయ క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు తాడికొండ ప్యాలెస్ అనకొండలను వదులుతోందని ఆరోపించారు.