గుంటూరు కలెక్టరేట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్దురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు నగరంపాలెం పోలీసులు తెలిపారు. గురువారం వృద్దురాలు కింద పడిపోయి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రిలో చేర్చారన్నారు. చికిత్స పొందుతూ మరణించిన వృద్దురాలి ఆచూకీ తెలిసిన వారు స్టేషన్లో సంప్రదించాలన్నారు.