తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉదయం 10 గంటలైనా బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.