బంగ్లాదేశ్లో హిందూవులపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాజ్బరి జిల్లాలో అమృత్ మండల్ (29) అనే యువకుడిని అల్లరిమూకలు దారుణంగా కొట్టి చంపాయి. దీపు చంద్ర దాస్ హత్య మరువక ముందే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఇస్లామిక్ మూకలు విచక్షణారహితంగా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వరుస హత్యలతో అక్కడి మైనారిటీలు(హిందూలు) బిక్కుబిక్కుమంటున్నారు.