NLG: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి నిస్వార్ధంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని బీజేపీ జిల్లా నాయకులు కాసోజు శంకరాచారి అన్నారు. సర్పంచిగా ఓటమి చెందినా.. నేరడ గ్రామ అభివృద్ధికి పాలకవర్గంతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. గురువారం ఆయన స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ మిర్యాల వెంకటేశంను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.