MHBD: కొత్తగూడ మండలం రేనియా తండాలో ఇవాళ రూ. 20 లక్షలతో వ్యాయాయంతో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు ఇవాళ మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్థులకు సౌకర్యవంతమైన పంచాయతీ భవనం అందుబాటులోకి రానుందని హామీ ఇచ్చారు.