SRD: కరీంనగర్ పట్టణంలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పుల్కల్ కేజీబీవీ విద్యార్థులు ఏడుగురు ఎంపికైనట్లు పీడీ శోభ తెలిపారు. అందరికీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో పాల్గొనేందుకు విద్యార్థులు తరలివెళ్లినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.