VSP: క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రేమ, త్యాగం, సేవ వంటి విలువలను మన జీవితాల్లో నాటే మహా పర్వదినమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సూర్యాబాగ్లోని ట్రినిటీ లూథరన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యేసుక్రీస్తు జననం వినయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.