KDP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది. మధ్యాహ్న భోజన పథకం కోసం తీసుకువచ్చిన స్మార్ట్ కిచెన్ స్కీమ్ అమలు బాధ్యతలను వారికి అప్పగించనుంది. ఇప్పటికే కొన్నిచోట్ల విజయవంతంగా నడుస్తున్న ఈ స్మార్ట్ కిచెన్ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.