KDP: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ జీవో జారీ చేసింది. జనవరి నుంచి గోధుమ పిండిని ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. కాగా, ప్రస్తుతం మార్కెట్లో గోధుమ పిండి ధర 40 నుంచి 80 రూపాయల వరకు ఉంది.