TG: అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు గెజిట్ విడుదలైంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆర్టికల్ 174(1) ప్రకారం శాసనసభ ఏడో సమావేశానికి అదే విధంగా శాసనమండలి 25వ సమావేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయ సభలు ఈ నెల 29న అసెంబ్లీ, కౌన్సిల్ హాలులో ఉదయం 10.30కి నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు.