E.G: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. క్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి, ఐక్యత వంటి విలువలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని పేర్కొన్నారు. ఈ వేడుకలు సమాజంలో మానవత్వం, ఐక్యతను బలపరచాలని ఆకాంక్షించారు.