ప్రపంచ కప్ గెలిచిన సారథిగా కపిల్ దేవ్, ధోనీ, రోహిత్ వంటి దిగ్గజాల సరసన నిలవడం తనకు గొప్ప అనుభూతి అని భారత T20 కెప్టెన్ సూర్య తెలిపాడు. వారితో పోల్చడం సంతోషంగా ఉందని, మరిన్ని ట్రోఫీలు గెలిచేందుకు కృషి చేస్తానన్నాడు. ఇక టోర్నీకి ముందు ధోనీని కలిశానని.. ‘మన జట్టు బాగుంది. ధైర్యంగా ఆడితే కప్ మనదే’ అని మహీ చెప్పాడని సూర్య పేర్కొన్నాడు.