ATP: క్రైస్తవ సోదరులకు అనంతపురం, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఆనంద్, శ్యాంప్రసాద్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. దేవుని కృపాకటాక్షాలతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు.