KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బుధవారం తన ఉదారతను చాటుకున్నారు. పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోతులకు ఆమె స్వయంగా ఆహారాన్ని తినిపించి మూగజీవాలపై మమకారం చాటుకున్నారు. మూగజీవాల పట్ల కారుణ్యం కలిగి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.