ATP: మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో 81 మంది లబ్ధిదారులకు రూ.37,95,220 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు నేడు పంపిణీ చేశారు. వజ్రకరూరు, విడపనకల్లు, కూడేరు మండలాలకు చెందిన బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. పేద కుటుంబాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని శ్రీనివాసులు పేర్కొన్నారు.