HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే నుమాయిష్‌కు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 85వ నుమాయిష్ జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15న ముగియనుంది. ఈ ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుఖేష్ రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్‌ను దాదాపు 25 లక్షల మందికిపైగా సందర్శకులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.