AP: బ్యాడ్మింటర్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వివాహమై ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. బ్యాడ్మింటన్ రంగంలో బాగా రాణించాలని వేడుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఇండోనేషియా, మలేషియా, ఇండియాలో టోర్నమెంట్లు ఉన్నాయన్నారు. విశాఖలో అకాడమీ నిర్మాణం జరుగుతోందని, మంచిపేరు రావాలని ప్రార్థించానన్నారు.