ASR: రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న భూ మ్యూటేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. ప్రతిరోజూ భూ సర్వే అంశాలపై సమీక్ష ఉంటుందని, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. క్లిష్టమైన సమస్యలుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు.