GNTR: కొలకలూరు గ్రామ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. సభలో ఆయన దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.