KMR: జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉదయం ప్రయాణాలు చేసేవారు చలిగాలులకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. బైక్పై వెళ్తుంటే చలిగాలులు బాణంలా దిగుతున్నాయి. ప్రయాణంలో వణుకుతున్న శరీరానికి కాస్తంత వేడి పుట్టించేందుకు మార్గమధ్యలో ఉన్న హోటళ్ల వద్ద ఆగి టీ, కాఫీ, వేడివేడి పానీయాలతో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తూ ఉపశమనం పొందుతున్నారు.
Tags :