NZB: జిల్లా కేంద్రంలోని గూపన్పల్లి శ్రీచైతన్య పాఠశాలలో నేడు ముందస్తుగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రీప్రైమరీ బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు రైతుల వేషధారణలో అలరించారు. పంటపొలాల్లో రైతులు చేసే పనులను చిన్నారులు చేస్తూ అబ్బురపర్చారు. విద్యార్థలు పలుగు, పార, వరిపైర్లు పట్టుకుని అచ్చం రైతులు చేసే పనులు చేస్తూ ఔరా అనిపించారు.