TG: తనపై BRS పార్టీపరంగా పిటిషన్ ఎందుకు వేయలేదని KCRను స్టేషన్ ఘన్పూర్ MLA కడియం శ్రీహరి ప్రశ్నించారు. BRS ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లు ఎలా చెల్లుతాయని, పిటిషన్లకు చట్టబద్ధత ఎలా ఉంటుందన్నారు. BRS పార్టీ తనకు షోకాజ్ ఇవ్వలేదని, తనను వివరణ అడగలేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించామని KCR ఎప్పుడూ అనలేదన్నారు. BRS అధ్యక్షుడిగా కేసీఆర్ ఎందుకు పిటిషన్ వేయలేదన్నారు.