NLG: దేశంలో పెన్షన్ పొందుతున్న పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం వారి పెన్షన్ రాకుండా కుట్ర చేస్తుందని దీన్ని సంఘటిత శక్తితో ఎదుర్కొనాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం నల్గొండలోని ఎస్సార్ ఫంక్షన్లో జిల్లా టాప్రా మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.