SKLM: ఆమదాలవలస పట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఏకపాత్రాభినయం ‘రంగస్థలం’ పోటీలు ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళలు-సంస్కృతి సమాజానికి జీవం వంటివని, యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో ఏకపాత్రాభినయం వంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.