BDK: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గపు చర్య అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ మార్కెట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.