యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోవడంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. ఈ ఓటమి జట్టులోని ప్రతి ఒక్కరినీ తీవ్రంగా బాధిస్తోందని తెలిపాడు. యాషెస్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టినప్పటికీ, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో తమ కంటే మెరుగ్గా రాణించిందని పేర్కొన్నాడు.