క్రికెట్‌ను గౌరవించినందుకు ప్రతిఫలంగానే ఇషాన్ కిషన్‌కు తిరిగి జట్టులో చోటు దక్కిందని అశ్విన్ పేర్కొన్నాడు. జట్టు నుంచి దూరమైనా నిరాశ చెందకుండా బుచ్చిబాబు ట్రోఫీ, రంజీ, ముస్తాక్ అలీ వంటి టోర్నీల్లో ఆడి పరుగుల వరద పారించాడని కొనియాడాడు. ఎంతటి పెద్ద ఆటగాడైనా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాణించాల్సిందే అనే సందేశాన్ని సెలక్టర్లు దీని ద్వారా ఇచ్చారని పేర్కొన్నాడు.