టీమిండియాతో జరుగుతున్న U19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 347/8 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సమీర్ మిన్హాస్ (172) భారీ శతకంతో విజృంభించగా, అహ్మద్ హుస్సేన్ (56) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు.