KNR: అధిక వడ్డీ వేధింపులు తాళలేక బెజ్జంకి(M) దాచారంలో బట్టల వ్యాపారి దంపతులు వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.10శాతం వడ్డీతో తమను వేధిస్తున్న ఐదుగురి పేర్లను సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. వీరి మృతితో 6 నెలల పసిపాప అనాథగా మారింది. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.