కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ నెట్టింట వైరల్ అయిన మోనాలిసా క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఆమె.. షాపింగ్ మాల్స్, హోటల్స్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొంటుంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ హోటల్‌కు చెందిన కిచెన్ విభాగాన్ని ఆమె ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.